![]() |
![]() |

బుల్లితెర మీద కామెడీ షో జబర్దస్త్ కి వచ్చినంత పేరు ఇంక దేనికీ రాలేదు. ఇప్పుడు కొంచెం జోరు తగ్గినా... అప్పట్లో మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చేది. నాగబాబు, రోజా జడ్జెస్ గా, అనసూయ, రష్మి యాంకర్స్ గా అంతా ఒక టీమ్ గా ఉండేవాళ్ళు. ప్రతి వారం ఈ షో కోసం ఆడియన్స్ బాగా వెయిట్ చేసేవారు. ఐతే రానురాను కామెడీలో క్వాలిటీ తగ్గింది. దాంతో ఈ షోకి కొంత క్రేజ్ తగ్గిందనే చెప్పొచ్చు. ఐతే రోజా, నాగాబాబు వెళ్లిపోయాక.. అనసూయ ఈ షోకు గుడ్ బై చెప్పింది.. ఆ తర్వాత ఈమె ప్లేసులోకి సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చింది. ఈమె కొంత కాలం జబర్దస్త్ కి యాంకరింగ్ చేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా పార్టిసిపేట్ చేసేది. తెలుగు పర్ఫెక్ట్ గా రాకపోయినా మేనేజ్ చేసేది. తన గ్లామర్ తో కొంతవరకు హైలైట్ అయ్యింది ఈ అమ్మడు. ఐతే ఏమయ్యిందో ఏమో కానీ సౌమ్య ఈ షోకి యాంకరింగ్ చేయడం మానేసింది. ఇప్పుడు ఆమె ప్లేస్ లో సిరి హన్మంత్ వచ్చింది.
సౌమ్య తెలుగు షోస్ ఎందులోనూ కనిపించడం లేదు. ఐతే ఏమయ్యింది అంటూ ఎంతో మంది నెటిజన్స్ అడిగినా టైం వచ్చినప్పుడు సమాధానం చెప్తాను అని చెప్పేది. రీసెంట్ గా ఈ భామ బీచ్ లో నడుస్తూ పరిగెడుతూ ఫోటో షూట్ చేసింది. దాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఈ పిక్ కి కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. "బీచ్ లో దేవత నడుస్తున్నట్టుగా ఉంది..వ్వావ్ డియర్..సో బ్యూటిఫుల్..జబర్దస్త్ లో నిన్ను మిస్ అవుతున్నాం...మిమ్మల్ని సీరియల్స్ లో మిస్ అవుతున్నాం.. ఎలా ఉన్నావు సౌమ్య..తిరిగి రా యాంకరింగ్ చెయ్యి మళ్ళీ..ఎలా ఉన్నారు" అంటూ యోగక్షేమాలు అడుగుతున్నారు. మరి సౌమ్య మాత్రం అసలు యాంకరింగ్ నుంచి ఎందుకు పక్కకు తప్పుకుంది...ఆమె వెళ్లిపోయిందా ఎవరైనా వెళ్లిపోయేలా చేసారా అనే విషయం క్లారిటీ ఇవ్వలేదు ఈ అమ్మడు.
![]() |
![]() |